Monday, February 11, 2019

టెస్టోస్టెరాన్ పెరుగుదలకు గృహ చిట్కాలు - Home Remedies to Boost Testosterone in Telugu

టెస్టోస్టెరాన్ ఒక స్టెరాయిడ్ హార్మోన్. పురుషులు మరియు మహిళలలో శృంగార కణాలు ఏర్పడటానికి అవసరమైయ్యే శృంగార అవయవాల యొక్క బీజాగ్రంధుల (gonads) నుండి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి మరియు విడుదల అవుతుంది. టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేసే ప్రధాన అవయవాలు మగవారిలో వృషణాలు(పునరుత్పత్తి వ్యవస్థలో వీర్యకణాలు ఉత్పత్తి చేసే అవయవం) మరియు ఆడవారిలో అండాశయాలు (పునరుత్పత్తి వ్యవస్థలో అండం ఉత్పత్తి చేసే అవయవం). ఈ అవయవాలు పిట్యూటరీ హార్మోన్ల ప్రభావంతో పనిచేస్తాయి.

టెస్టిస్టెరోన్ శరీరానికి చాలా ముఖ్యం. ఇది ముఖ జుట్టు పెరుగుదల,గొంతులో మార్పు, కండరాల పెరుగుదల,మొదలైన వాటిలో పురుష లక్షణాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ అధ్యయనాలు మరియు వాటి సమీక్ష వ్యాసాలు ఇది భౌతిక బలం, శరీరంలో మంచి కొలెస్ట్రాల్ యొక్క నిర్వహణ, ఎముకల పెరుగుదల, మెదడు-నైపుణ్యాలు, లైంగిక వాంఛ మెరుగుపరుచుట, అంగస్తంభన పనితీరు, కొవ్వు పెరుగుడల తగ్గించడం, మూడ్ ని పెంచటం మరియు ఇన్సులిన్ హార్మోన్ పై శరీర సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.

టెస్టోస్టెరోన్ స్థాయిలలో తగ్గుదల పురుషులలో సాధారణంగా 40 ఏళ్ల వయస్సు తరువాత మరియు మహిళల్లో మెనోపాజ్ (మహిళల్లో ఋతు చక్రాల శాశ్వత ముగింపు) తర్వాత కనిపిస్తుంది. తక్కువ సీరం టెస్టోస్టెరోన్ స్థాయిల యొక్క ఇతర కారణాలు వృషణాల వైఫల్యం, గవదబిళ్ళలు, రక్తంలో అధిక ఇనుము స్థాయిలు, గాయపడిన వృషణాలు, ఊబకాయం, ఒత్తిడి, అధిక కొలెస్ట్రాల్, కెమోథెరపీ, రేడియేషన్ థెరపీలు, హెచ్ఐవి-ఎయిడ్స్, పిట్యూటరీ గ్రంథి యొక్క లోపాలు మొదలైనవి. తక్కువ సీరం టెస్టోస్టెరోన్ చాలా శారీరక విధులను చాలా ప్రభావితం చేస్తుంది ఇది వృద్ధాప్య పురుషులు మరియు మహిళలు (రుతువిరతి తరువాత) ఆరోగ్య సమస్యగా ఉంది.

తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు చికిత్స కోసం వైద్యున్ని సంప్రదించవలసి వచ్చినప్పటికీ, శరీరంలో టెస్టోస్టెరోన్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి మీరు క్రింది ఉన్న కొన్ని వాటిని కూడా ప్రయత్నించవచ్చు. మహిళల్లో, టెస్టోస్టెరోన్ అనేది లైంగిక కోరిక, ఎముక ఆరోగ్యం, మానసిక స్థితి మరియు శ్రేయస్సు మెరుగుపరచడంలో సహాయపడుతుంది.



from myUpchar.com के स्वास्थ्य संबंधी लेख
via https://www.myupchar.com/te/tips/testosterone-badhane-ke-tarike-in-hindi

No comments:

Post a Comment