Saturday, February 9, 2019

అర్జున చెట్టు బెరడు ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు - Arjuna (Terminalia) Tree Bark Benefits, Uses and Side effects in Telugu

అర్జున బెరడు అంటే ఏమిటి?

అర్జున చెట్టు టెర్మినల్యా జాతికి చెందిన సతత హరిత (evergreen) చెట్టు, అది కరక్కాయ చెట్టు (టెర్మినాలియా చెబులా) మరియు బహేదా చెట్టు (టెర్మినలియా బెల్లెరికా) వంటి ఔషధ అద్భుతాలతో పాటుగా ఉంది. ఈ అలంకార చెట్టు యొక్క ఔషధ సామర్ధ్యం దాని లోపలి బెరడులో ఉంది, దీన్ని గుండెకు ఒక టానిక్గా భావిస్తారు. నిజానికి, ఈ చెట్టు యొక్క ప్రస్తావన రిగ్ వేదంలో కనిపిస్తుంది. ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి అర్జున బెరడును సూచిస్తారు. వైద్యపరంగా మాట్లాడితే, అర్జున చెట్టు యొక్క బెరడు వివిధ రకాల గుండె వ్యాధులలో గుండె ఆగిపోవడం, గుండెపోటు మరియు గుండె వైకల్యాలలో దాని వైద్య ప్రయోజనాల కోసం చాలా అధ్యయనం చెయ్యబడింది. అర్జున బెరడును హృదయ చక్రంగా (మానవ శరీరం యొక్క శక్తి కేంద్రం) విశ్వసిస్తారు మరియు దాని ఔషధ లక్షణాలను పశ్చిమ మూలికలలో హవ్తోర్న్ అను పొద తో పోలుస్తారు.

భారతదేశంలో జన్మించిన, అర్జున చెట్టు సాధారణంగా నదులు మరియు ప్రవాహాల సమీపంలో దొరుకుతుంది, ఇది 25 నుండి 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అర్జున బెరడు నునుపుగా మరియు బూడిద రంగులో ఉంటుంది, కానీ మధ్యలో కొన్ని ఆకుపచ్చ మరియు ఎరుపు మచ్చలు కలిగి ఉంటుంది. అర్జున ఆకులు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి మరియు దాని శాఖలలో ప్రతి ఆకు ఎదురు ఎదురుగా ఉంటాయి. మే నుండి జూలై నెలల్లో ఈ చెట్టుకు తెల్లటి పుష్పాలు వికసిస్తాయి. అర్జున పండు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది మరియు పక్వానికి చేరినప్పుడు ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. అర్జున పండుకు ప్రత్యేకమైన రెక్కలు ఉంటాయి అవి ఈ పండును గుర్తించదగ్గ లక్షణాలలో ఒకటి.

మీకు తెలుసా?

టెర్మినలియా అనేది లాటిన్ పదం నుండి ఉద్భవించింది, అనగా చివరిది అని అర్ధం. ఇది దాని శాఖల చివరన పెరిగే అర్జున వృక్షపు ఆకులు గురించి చెప్పిఉండవచు. అర్జున అంటే తెలుపు లేదా ప్రకాశవంతమైనది అని అర్ధం, దానికా పేరు దాని తెల్ల పువ్వులు లేదా దాని మెరిసే తెల్ల బెరడు వలన నమ్ముతారు.

అర్జున చెట్టు గురించి కొన్ని ప్రాధిమిక నిజాలు.

  • శాస్త్రీయ నామము: టెర్మినేలియా అర్జున (Terminalia arjuna)
  • కుటుంబం: కంబ్రెటేసీ (Combretaceae)
  • సాధారణ నామము: అర్జున వైట్ మారుడా
  • సంసృత నామము: అర్జునా, ధవళ, నదీసర్జ
  • ఉపయోగపడే భాగాలు: బెరడు
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక వెస్తిర్ణం: అర్జున చెట్టు స్థానిక ప్రాంతం ఇండియా మరియు శ్రీలంక కానీ బాంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, ఇండోనేషియా, థాయిలాండ్ మరియు మలేషియాలో కూడా కనిపిస్తుంది.
  • శక్తి శాస్త్రం: అర్జున బెరడు పిత్త మరియు కఫాలను తగ్గించి వాటాన్ని పేంచుతుంది కాబట్టి అది శరీరం పై చల్లని ప్రభావాన్ని చూపిస్తుంది.


from myUpchar.com के स्वास्थ्य संबंधी लेख
via https://www.myupchar.com/te/tips/arjun-tree-bark-benefits-and-side-effects-in-hindi

No comments:

Post a Comment