Thursday, February 7, 2019

దాల్చిన చెక్క ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు - Benefits, Uses and Side Effects of Cinnamon (Dalchini) inTelugu

సుగంధ ద్రవ్యాలలో ప్రసిద్ధమైన “చెక్కా-లవంగాలు” లోని చెక్కనే “దాల్చిన చెక్క.” దాల్చిన చెక్క నేడు ప్రతి ఒక్కరి వంటింటిలోను కన్పించే ఓ మసాలా దినుసు (లేక సుగంధద్రవ్యం). రకరకాలైన తీపి వంటకాలు మరియు ఇతర అన్ని ఇంపైన వంటకాలకు ఓ పరిపూర్ణ మసాలా దినుసు దాల్చిన చెక్క. దాల్చిన చెక్క యొక్క గాఢతతో కూడిన సువాసన మరియు దాని తీపి కలకలిసిన రుచి వంటలకు మరింత మాధుర్యతను తెస్తుంది. అయితే దాల్చిన చెక్క కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాదు. దాల్చిన చెక్క యొక్క వైద్య ప్రయోజనాల కారణంగా దాన్ని ఇటు భారతీయ వైద్యంలోను, అటు సంప్రదాయిక చైనీస్ మెడిసిన్ (TCM)లోనూ చాలా కాలం నుండి వాడుతున్నారు. సంప్రదాయ పాశ్చాత్య వైద్య వ్యవస్థ కూడా దాల్చిన చెక్కకు  అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఇటీవలి శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, లవంగం తర్వాత దాల్చినచెక్క ఉత్తమ అనామ్లజని. దాల్చినచెక్క మసాలాదినుసుకు సుదీర్ఘమైన మరియు సుసంపన్నమైన చరిత్ర ఉంది, అది తెలుసుకోవాలని మీకూ ఉంటుందని ఆశిస్తున్నాం. దాల్చినచెక్కను మొట్టమొదటిగా ఉపయోగించిన దాఖలా 2000-2500 BC కాలానికి చెందినది. దాల్చినచెక్కను ఉపయోగించినట్లు యూదు బైబిల్లో ప్రస్తావించబడింది. తలంటుకు ఉపయోగించే దినుసుల్లో దాల్చిన చెక్కను ఉపయోగించినట్లు బైబిల్లో ఉదహరించబడింది. ఇంకా, ఈజిప్ట్ దేశస్తులు తమ “మమ్మిఫికేషన్” విధానాల్లో దీనిని ఉపయోగించారు. రోమ్ లో దాల్చినచెక్కను మనిషి చనిపోయాక అంత్యక్రియల సమయంలో శవ సంస్కారానికి వాడే వాళ్ళు, దీనివల్ల శవం నుండి వచ్చే దుర్వాసన తగ్గుతుంది.  వాస్తవానికి, ఈ దాల్చిన చెక్క రోమ్ లో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగానే చాలా కొనాలం పాటు కొనసాగింది గనుక, అప్పట్లో ఇది కేవలం ధనవంతుల మసాలా దినుసుగానే ఉండేది.

మీకు తెలుసా? 

కొంతమంది చరిత్రకారుల ప్రకారం, వాస్కో డ గామా మరియు క్రిస్టోఫర్ కొలంబస్ మొదట తమ సుదూర సముద్ర ప్రయాణాల్ని సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసుల అన్వేషణకోసమే ప్రారంభించారు. ముఖ్యంగా దాల్చినచెక్క కోసమే  వాళ్ళు ఎక్కువగా అన్వేషించారట. ఈ సంగతి వాస్తవమే, ఎందుకంటే, దాల్చినచెక్కకు పుట్టినిల్లు శ్రీలంక అన్న సంగతిని మొట్టమొదట శ్రీలంకలో దీన్ని కనుగొన్న పోర్చుగీసువారు చాటి చెప్పారు. ఇప్పటికీ కూడా దాల్చిన చెక్క చాలా ఖరీదైన దినుసుగానే రాజ్యమేలుతోంది. ఏది ఏమైనప్పటికీ, దాల్చినచెక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంటగాళ్లకు మరియు బ్రెడ్-వంటకాల తయారీదారులకు చాలా ఇష్టమైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. దాల్చినచెక్కను, దాల్చినచెట్టు యొక్క అంతర్గత బెరడు నుండి సేకరించబడుతుంది. ఇది ప్రపంచంలోని ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రధానంగా కనిపించే సతతహరిత వృక్షం (అంటే చాలా కాలంపాటుగా ఈ చెట్టు అంతరించకుండా ఉంటుంది). సహజసిద్ధంగా అడవుల్లో మొలిచి, పెరిగిన దాల్చిన వృక్షం 18 మీటర్ల ఎత్తు వరకు పెరగవచ్చు, కానీ సాగుచేసిన దాల్చినచెక్క చెట్టు రకాలు 2-3 మీతారల ఎత్తు పెరుగుతాయి. దాల్చిన చెక్క ఆకు ఈనెలు సమాంతరంగా ఉండి, (వాటి రెండు చివరలు, అంటే ఆకు మొదలు మరియు చివర) ఆకు కొనల్లో కలుస్తాయి. బే ఆకుల రూపం లేదా తేజ్ పట్టా వంటిదే దాల్చిన చెక్క ఆకు. దాల్చిన పువ్వులు అందమైన పసుపురంగు కల్గి  గుత్తులు గుత్తులుగా పెరుగుతాయి మరియు దాల్చిన కాయలు పండిన తర్వాత నల్లని పండ్లుగా మారుతాయి.

దాల్చిన చెక్కను గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

  • ఓషధిశాస్త్ర నామం: సిన్నమోమం వెర్ము / సిన్నామోమ్ జిలానికం
  • కుటుంబం: లారాసియా
  • సాధారణ పేర్లు: సిన్నమోన్, దాల్చిని
  • సంస్కృత నామం: దారుసిత
  • ఉపయోగించే భాగాలు: బెరడు
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: దాల్చినచెక్క దక్షిణ ఆసియాకు చెందినది, కానీ ఇది ప్రపంచంలోని అత్యధిక ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా ప్రవేశపెట్టబడింది. దాల్చినచెక్క ఎక్కువగా శ్రీలంక, మలగరీసీ రిపబ్లిక్ మరియు సీషెల్స్ ద్వీపం నుండి పొందబడుతుంది. భారతదేశంలో, దాల్చినచెక్క చెట్లను కేరళలో సాగు చేస్తారు.
  • శక్తిశాస్త్రం: తాపం/వేడిని (వార్మింగ్) కల్గించే సుగంధద్రవ్యమిది. రెండు దోషాలైన వాతాన్ని, కఫాన్ని శమింపజేస్తుంది. అయితే పిత్త దోషాన్ని  తీవ్రతరం చేస్తుంది.


from myUpchar.com के स्वास्थ्य संबंधी लेख
via https://www.myupchar.com/te/tips/dalchini-ke-fayde-aur-nuksan-in-hindi

No comments:

Post a Comment