జీలకర్ర ఓ సుగంధ మసాలా దినుసు. కేరెట్ మరియు పార్సులే కుటుంబానికి చెందినదీ సుగంధ మసాలా దినుసు. మీరు అంతర్జాతీయస్థాయి వంటలనాస్వాదించే వారైతే లేదా మీరు కేవలం ఆహార ప్రియులైతే తూర్పు యూరప్ మరియు ఆసియాప్రాంతాల్లోని అనేక రకాల వంటలలో జీలకర్రను సాధారణ పదార్ధంగా వాడి ఉంటారన్న సంగతిని మీరు గమనించే ఉంటారు. జిలకర గింజలు ఆకారానికి సన్నని బియ్యంలా ఉంటాయి. భారతీయులందరికీ ప్రియమైన మసాలా దినుసు జీలకర్ర. ఇది దాదాపు ప్రతి భారతీయ వంటగదిలోనూ కన్పిస్తుంది మరియు వంటల్లో ఉపయోగించబడుతుంది. నిజానికి, మొరాకో ప్రాంతంలో స్థానికంగా మామూలుగా తినే వంటల్లో సుగంధ పరిమళంకోసం జీలకర్రను ప్రధానమైనదిగా వాడతారు.
ఇరాక్లో దొరికిన పురాతన వంట-సంబంధమైన గ్రంథాల్లో జీలకర్రకు సంబంధించిన వంటకాల గురించిన ప్రస్తావాన ఉందంటే మీకు ఆశ్చర్యం మరియు ఆనంద కలగొచ్చు. అయితే, జీలకర్ర ఉపయోగం కేవలం పాక ప్రపంచానికి మాత్రం పరిమితం కాలేదు. ఆయుర్వేద, జానపద ఔషధ విధానాల్లో రోగాల్ని నయం చేసే మూలికగా మరియు ఆరోగ్యనిర్మాణ వస్తువుగా ముఖ్యమైన స్థానాన్ని పొందిందని తెలుస్తోంది. అనేక జనసముదాయాల సంస్కృతులలో జీలకర్రను తల్లిపాలను వృద్ధి చేసేందుకు (గెలాక్టాగోగ్ ఉపయోగం కోసం) మరియు సూక్ష్మవిషజీవనాశినిగా (యాంటీమైక్రోబియాల్) గా ఉపయోగించబడుతోంది. కొందరు చరిత్రకారుల ప్రకారం, పురాతన ఈజిప్టులో జీలకర్రను ఓ ముఖ్యమైన “ఔషధ మసాలా”గా పరిగణించబడింది.
జీలకర్ర యొక్క ఆయుర్వేద వాడకాన్ని ధృవీకరించడానికి ఇప్పుడు అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. నిజానికి, జీలకర్ర విత్తనాలు ఊబకాయం మరియు మధుమేహం యొక్క లక్షణాలను తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తాయని నిరూపించబడింది. మీ రుచికి ఇష్టపడే విధంగాను మరియు మీ శరీరానికి మేలు చేసే మసాలా దినుసుగా కూడా జీలకర్రను ఉదాహరించవచ్చు కదా?
మీకు తెలుసా?
జీలకర్ర మొక్క ఏడాది పాటూ మనగలిగేది. ఇది 1 నుండి 1.5 అడుగుల వరకు పెరుగుతుంది. జీలకర్ర మొక్క యొక్క కాండం సున్నితమైనది, నున్ననైంది మరియు మెత్తనైనది ఉంది పలు శాఖల్ని కల్గి ఉంటుంది. దీని ఆకులు పొడవుగా మరియు సమ్మిశ్రితమైనవిగా ఉంటాయి, మరి పువ్వులైతే చిన్నవిగా ఉండి తెలుపు లేదా ఎరుపు రంగులో ఉంటాయి. ఈ పూలు కొమ్మలపై గుత్తులు గుత్తులుగా పూస్తాయి. జీలకర్ర విత్తనాలు పొడవుగా ఉంటాయి కానీ అండాకారం దాల్చి ఉంటాయి మరియు వాటి ఉపరితలంపై గట్లు/నొక్కులు ఉంటాయి.
జీలకర్ర గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- ఓషధీశాస్త్రం (బొటానికల్) పేరు: కుమినమ్ సిమినం
- కుటుంబం: అపియేసి
- సాధారణ పేర్లు: క్యుమిన్, జీరా, జిరా. (తెలుగులో జిలకర అని జీలకర్ర అని పిలుస్తారు)
- సంస్కృత నామం: జిరాకా.
- ఉపయోగించే భాగాలు: విత్తనం.
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: కుమిన్ ఈజిప్టులో జన్మించింది , కానీ ఇది సాధారణంగా చైనా, మొరాకో మరియు భారతదేశంలో కూడా పెరుగుతుంది.
- శక్తిశాస్త్రం: ఉష్ణం
from myUpchar.com के स्वास्थ्य संबंधी लेख
via https://www.myupchar.com/te/tips/jeere-ke-fayde-aur-nuksan-in-hindi
No comments:
Post a Comment